లక్ష కోట్ల సంపద, కానీ పల్లెటూరి జీవన శైలి.. సైకిల్ ప్రయాణం!

Joho corp

ఈ రోజుల్లో పిల్లలని ఇతర దేశాలకి పంపించి అక్కడే సంపాదించుకోవాలి అనే తల్లి తండ్రులకి పిల్లలకి ఈ స్టోరీ కళ్ళు తెరిపిస్తుంది, తెలివితేటలు కష్టపడే తత్వం ఉంటే మన వుండే ఊరిలో ఉండి అద్భుతాలు చేయొచ్చు , డబ్బులు సంపాదించవచ్చు మరియు కంపెనీలు పెట్టవచ్చు. ఎందుకు ఇలా చెబుతున్నానని అనుకుంటున్నారా ఐతే ఈ స్టోరీ చదవలిసిందే.

ఒక మారుమూల గ్రామం లో ఒక సాధారణ కుటుంబం నుంచి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, తన ప్రతిభతో ఐఐటీ లో ఇంజినీరింగ్ చేసి తరువాత అమెరికాలో పెద్ద చదువులు చదివి అక్కడే ఒక కంపెనీలో వర్క్ చేసి , మన desamlo ఏదోకటి చేయాలి అని దేశం మీద, ఊరి మీద ప్రేమ తో , ఇండియా లోనే కంపెనీ స్థాపించి రన్ చేస్తూ , తన సొంత పల్లెటూరులోనే ఆఫీస్ ఏర్పాటుచేసుకున్నారు , అంతే కాకుండా చిన్న చిన్న అవసరాలకి సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు ఆయన, ఈరోజుల్లో ఇరవై వేల రూపాయలు సంపాదించే వాళ్ళే సైకిల్ తొక్కటం నామోషీగా ఫీల్ అవుతున్నారు కానీ ఆయన 28 వేల కోట్ల ఆస్తి వున్నా సాధారణ జీవితం గడుపుతున్నారు. అతను పేరే శ్రీధర్ వెంబు మరియు జోహో కార్పొరేషన్ సంస్థకి ఫౌండర్.

శ్రీధర్ వెంబు పుట్టింది తమిళనాడు లోని తంజావూరు లో , బాల్యం అంత అక్కడే గడిచింది. అతని కుటుంబం సాధారణ కుటుంబం అవ్వటం వలన తన చదువు ప్రభుత్వ బడి లో తమిళ్ మీడియం లో సాగింది. ఆయన తండ్రి చెన్నై హైకోర్టు లో స్టెనోగ్రాఫర్ గా పని చేసే వారు. చిన్న తనం నుంచి చదువులో ముందు ఉండటం వలన ఐఐటీ జేఈఈ లో అల్ ఇండియా 27th ర్హ్యాంక్ సాధించారు. తరువాత మద్రాస్ ఐఐటీ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసారు. అక్కడితో ఆగకుండా విదేశీ విద్య చేయాలనే సంకల్పం తో కస్టపడి అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ లో చేరి అక్కడే పెద్ద చదువులు పూర్తిచేసారు. కానీ ఇంకా ఎదో చేయాలి ఇది కాదు నేను చేయాలిసింది అనిపించేది,అంతే కాకుండా అకాడమిక్స్ లో రాణించిన అలాగే PHD సాటిస్ఫాటిన్ ఉండేది కాదు.

చదువులో నేపుణ్యం ఉండటం సాదించాలి అనే సంకల్పం ఉండటం వలన అమెరికా లో నే 1994లో మొదటి జాబ్ Qualcom అనే కంపెనీలో ఉద్యోగం సాధించారు. అప్పుడు సి++ ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్ చేయాలిసింది వచ్చింది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియకపోయిన , బుక్స్ చదివి తన సొంత గా సి++ ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఒక సాఫ్ట్వేర్ తయారుచేసారు అది హార్డ్వేర్ కి సపోర్ట్ చేసేటట్టు. ఇక్కడే అతని టాలెంట్ తెలుస్తుంది ఎంత నేర్చుకొనే తత్వం ఉందొ. ఇలా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉండగా ఒక రోజు అతని బ్రదర్ తో కలిసి ఇండియా లో సొంత కంపెనీ పెట్టాలని ఆలోచన చేసారు.

ఆలోచన వచ్చిన వెంటనే వారు ఇండియా లో చెన్నై లో కంపెనీ స్టార్ట్ చేసారు , కంపెనీ పేరు AdventNet అని పెట్టారు, అప్పటిలో ఈ కంపెనీ ద్వారా హార్డ్వేర్ మరియు మెషిన్ తయారుచేసి సేల్ చేయాలి అనుకున్నారు కానీ వాళ్ళకి ఫైనాన్సియల్ సిట్యుయేషన్ ఎదురయింది, వున్నా సేవింగ్స్ మొత్తం పెట్టి మెషిన్ తయారు చేయాలి అని స్టార్ట్ చేసారు కానీ అది అనుకున్న విధము గా చేయలేక పోయారు దానితో వాళ్ళు రోడ్ మీద నుంచోవాలిసిన పరిస్థితి అయింది. ఎందుకంటే అప్పట్లో ఎవరు స్పాన్సర్స్ లేరు వున్నా డబ్బు మొత్తం కంపెనీ కోసం పెట్టేసారు.

తరువాత ఇంకా బాగా ఆలోచన చేసి హార్డ్వేర్ కంపెనీ నుంచి సాఫ్ట్వేరు కంపెనీ గా చేంజ్ చేసారు, ఎందుకు అంటే కొంచం ఖర్చు తక్కువ అని ఆలోచన చేసారు.

ఒక చిన్న గదిలో రెండు కంప్యూటర్స్ పెట్టుకొని సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభం చేసారు, మొదటి క్లయింట్‌ను $30,000 (2.5 లక్షలు)కి డీల్ క్లోజ్ చేశారు. కానీ, ఆ క్లయింట్ చెప్పిన మాట విన్నాక వారికి నిజమైన వ్యాపారం ఎలా చేయాలో అర్థమైంది.

“మీ సాఫ్ట్‌వేర్ అద్భుతంగా ఉంది, అందుకే కొన్నాను. కానీ, మీ సేల్స్ స్కిల్స్ చాలా మందహుషంగా ఉన్నాయి. మీ మాటల వల్ల కాదు, మీ ప్రొడక్ట్ వల్ల కొన్నాను” అని క్లయింట్ చెప్పాడు.

అప్పుడే శ్రీధర్ వెంబు “నేను టెక్నికల్‌గా బలంగా ఉన్నాను, కానీ వ్యాపారాన్ని అర్థం చేసుకోవాలి” అని గ్రహించాడు. దీని కోసం ఒక సేల్స్ ఎక్స్‌పర్ట్‌ను హైర్ చేసి, రెండు సంవత్సరాలు పూర్తిగా సేల్స్ నేర్చుకున్నాడు.

ఒక ఎగ్జిబిషన్‌లో, జపాన్ నుండి వచ్చిన HP కంపెనీ ప్రతినిధులు Zoho సాఫ్ట్‌వేర్ చూసి ఆకర్షితులయ్యారు. HP లాంటి కంపెనీలు పెద్ద కంపెనీలకు అధిక ధరలతో సాఫ్ట్‌వేర్ అందించేవి. కానీ, జపాన్ క్లయింట్లు “మాకు కూడా అలాంటి సాఫ్ట్‌వేర్ కావాలి, కానీ తక్కువ ఖర్చుతో” అని కోరారు.

దీంతో, శ్రీధర్ వెంబు Zohoను చిన్న వ్యాపారాలకు అనువైన విధంగా డెవలప్ చేశాడు. 1998 నాటికి Zoho ఆదాయం $1 మిలియన్ (8.3 కోట్లు) చేరుకుంది.

తర్వాత $25 మిలియన్ల (200 కోట్లు)కోసం కంపెనీని అమ్మమని ఆఫర్ వచ్చింది. కానీ, ఆయన తన స్వంత డబ్బుతో వ్యాపారం పెంచుకోవాలని నిర్ణయించుకుని ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు.

2000 నాటికి కంపెనీ 115 మంది ఉద్యోగులతో $10 మిలియన్ (83 కోట్లు) ఆదాయం సాధించింది.

అతను పెట్టిన కంపెనీ డిటైల్స్ తెలుసుకుందాము :-

అతను నడుపుతున్న కంపెనీ పేరు Zoho. ఈ కంపెనీ 180+ దేశాల్లో వ్యాపారం చేస్తోంది, 6 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు, 11,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.

Zoho సేవలు Fortune 500 కంపెనీల్లో 300కి పైగా కంపెనీలు ఉపయోగిస్తున్నాయి, అందులో Apple, Netflix, Amazon, Mahindra వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉన్నాయి.
Zoho వార్షిక ఆదాయం 7000 కోట్లు, లాభం 2700 కోట్లు, కంపెనీ విలువ 40,000 కోట్లు.

డాట్.కామ్ క్రాష్ క్రైసిసి:-

2000లో Dot.com క్రాష్ కారణంగా 80% క్లయింట్లు కోల్పోయారు. అయితే, ఆయన ముందు నుంచే డబ్బును పొదుపుగా ఉపయోగించి, అనవసర ఖర్చులు లేకుండా క్యాష్ రిజర్వ్ చేసుకున్నాడు.

ఇతర కంపెనీలు ఉద్యోగులను తొలగించగా, Zoho మాత్రం “R&D సంవత్సరంగా” ప్రకటించి కొత్త ప్రొడక్ట్స్ అభివృద్ధి చేసింది.

దీంతో, “Zoho – Cloud SaaS” వ్యాపారం ఆరంభమైంది. ERP, CRM, HR, Sales, Marketing వంటి అనేక అప్లికేషన్లతో, చిన్న వ్యాపారాలకు తక్కువ ధరలో అధిక విలువ ఇచ్చే విధంగా Zoho ముందుకు సాగింది.

స్వదేశీ అభివృద్ధి

శ్రీధర్ వెంబు వ్యాపారాన్ని ఊరి నుంచి నడపాలనే నిర్ణయం తీసుకున్నారు.

  • ఆయన ఊర్లో ఉన్న ఇళ్లను Zoho R&D సెంటర్‌గా మార్చారు.
  • నైపుణ్యం ఉన్న యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించారు.
  • “Made in India, Made for the World” అనే సిద్ధాంతాన్ని పాటించారు.

Zoho విశేషాలు

  • సంపూర్ణంగా భారతీయ కంపెనీ
  • పెట్టుబడిదారుల డబ్బు లేకుండా 100% స్వంతంగా అభివృద్ధి
  • 6 కోట్లకు పైగా కస్టమర్లు
  • 7000 కోట్ల ఆదాయం, 2700 కోట్ల లాభం
  • పద్మశ్రీ అవార్డు గ్రహీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *