ప్రయాణం అనేది జీవితం లో ఒక ముఖ్య భాగం , ముఖ్యంగా ట్రైన్ ప్రయాణాలు మరియు బస్సు ప్రయాణాలు, మనం ఇప్పటికి చూస్తూవుంటాం పండగ టైం లో బస్సు టికెట్ గాని ట్రైన్ టికెట్ గాని దొరకటం ఎంత కష్టమో అలాంటిది ఒక 20 ఇయర్స్ క్రితం ఎలా ఉండేదో ఆలోచించండి, అప్పటిలో ఇప్పుడు వున్నా వసతులు లేవు, ఇప్పుడు మనం బస్సు బుక్ చేయటానికి చక్కగా ఫోన్ లో నే చేసుకుంటాం,వివిధ యాప్స్ ద్వారా , కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఓన్లీ వెబ్సైటు ఉండేవి అందువల్ల మనం నెట్ సెంటర్ లేక టికెట్ బ్రోకర్ దెగ్గరికి వెళ్లి బుక్ చేసుకోవాలి, ఇంకా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఐతే ఓన్లీ బస్సు బుక్ ఆపరేటర్లు ద్వారా మాత్రమే బస్సు టికెట్స్ కొనగలం. సరే ఇది అంత ఎందుకు చెబుతున్నావు అనుకుంటున్నారా ? ఇప్పుడు మీరు చూడబోయే స్టోరీ ఎవరిదో కాదు “రెడ్ బస్”. ప్రయాణాలు చేసే చాలామందికి రెడ్ బస్ యాప్ తెలిసేవుంటాది. ఈ యాప్ ద్వారా ఈజీ గా బస్ బుక్ చేసుకొని హ్యాపీ గా ప్రయాణం చేయొచ్చు.
రెడ్ బస్ ఐడియా ఎలా వచ్చింది :-

అది 2005 సంవత్సరం ,ఒక యువకుడు అతని పేరే (ఫణీంద్ర సమా) నిజామాబాద్ చెందిన యువకుడు, బెంగళూరు లో STs ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగం చేస్తూ వుంటూ , ప్రతి నెలలో లేదా ప్రతి రెండు మూడు వారాలకి అతను బెంగళూర్ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేసేవాడు,ఎందుకు అంటే అతని ఫ్యామిలి అలాగే అతని స్వస్తలం నిజామాబాద్ కాబట్టి. ఎప్పటి లగే దీపావళి పండగ వచ్చింది అందరు ఉరులకి ప్రయాణం అవుతున్నారు, ఫణింద్ర కూడా ఊరికి వెళ్ళాలి అని బయలుదేరాడు, బయలుదేరి బస్సు బుక్ ఆపరేటర్స్ దెగ్గరికి వెళ్ళాడు, వెళ్లి టికెట్స్ అడిగాడు ఎప్పటిలాగే కానీ టికెట్ దొరకలేదు ఎందుకంటే అది పండగ సీజన్ కాబట్టి. బస్సు టికెట్ బుక్ చేసే అతను ఒక 5 బస్సు ఆపరేటర్స్ (బస్సు డ్రైవర్స్ ) కి ఫోన్ చేసి చూసాడు కానీ సీట్ లేదు అని చెప్పారు. అతని సలహా మేరకు వేరే బస్సు బుకింగ్ ఏజెన్సీ షాప్స్ లో కనుకోమ్మన్నాడు, ఫణింద్ర చేసేది ఏమి లేక ఆలా ఒక ఐదు ఆరు షాప్స్ లో టికెట్ కోసం ట్రై చేసాడు కానీ ఒక టికెట్ దొరకలేదు, బాధ తో చేసేది ఏమి లేక రూమ్ కి వెళ్ళిపోయాడు. మరునాడు మార్నింగ్ నిద్ర లేచి చూసేసరికి అందరు సొంత ఉరులకి వెళ్లిపోయారు బట్ ఫణింద్ర మాత్రం ఒక్కడే వున్నాడు.
అప్పుడు ఫణింద్ర కి అని పించింది , రోజు కి ౩౦ నుండి 50 బస్సు లు బెంగుళూరు నుండి హైదరాబాద్ వెళుతున్నవి ఎక్కడో ఒక బస్సు లో ఒక సీట్ వుండి ఉండొచ్చు కానీ తెలియకపోవచ్చు. ఒకవేళ తెలుసుకునే అవకాశం ఉంటే నాకు లాభం అలాగే బస్సు డ్రైవర్ కి అలాగే బస్సు ఏజెన్సీ వాళ్ళకి లాభం,ఇలా తెలియకపోవటం వలన అందరు నస్టపోతారు అని అనిపించింది.
ఇక్కడే ఐడియా కి పునాది పడింది, ఎందుకు ఒక వెబ్ సైట్ ఉండకూడదు , అందులో ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయో తెలిసేటట్టు అని అనుకున్నాడు.
ఈ ఆలోచన వెంటనే ఫస్ట్ అసలు బస్సు టికెట్ బుకింగ్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని చెప్పి ఏజెంట్స్ దెగ్గరికి వెళ్లి అసలు ఈ మొత్తం ప్రాసెస్ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నాడు. ఇంతలో ఊరికి వెళ్లిన తన ఫ్రెండ్స్ బెంగుళూరు వచ్చారు. వెంటనే ఫణింద్ర ఈ ఐడియా ని తన ఇద్దరి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాడు, వారు కూడా ఐడియా వినగానే , బాగుంది మనం చేద్దాము అని అనుకున్నారు.

వెబ్సైటు/సాఫ్ట్వేర్ రూపకల్పన ఎలా జరిగింది :-
ఫణింద్ర అతని ఫ్రెండ్స్ చరణ్ పద్మరాజు మరియు సుధాకర్ పసుపునురి, సాఫ్ట్వేర్/అప్లికేషన్ చేద్దాము అనుకున్నారు కానీ వీళ్ళకి సాఫ్ట్వేర్ లో అనుభవం లేదు. వీరికి రెండు మార్గాలు వున్నవి ఒకటి బయట నుంచి ఎవరినైనా తీసుకోని సాఫ్ట్వేర్ చేపించుకోవటం లేదా వీళ్ళే చేయటం. బయట నుంచి తీసుకుంటే వాళ్ళకి చాల డబ్బులు ఇవ్వాలి, అందుకని వీళ్ళే చిన్న జావా ప్రోగ్రాం అలాగే డేటాబేస్ కనెక్షన్ నేర్చుకున్నారు అందుకు గాను మరల వాళ్ళు పుస్తకాలూ పట్టాలిసి వచ్చింది. కస్టపడి ఫైనల్ గా వారు అనుకున్న అప్లికేషన్/సాఫ్ట్వేర్ రెడీ చేసారు.
తరువాత బస్సు ఆపరేటర్స్ దెగ్గరికి వెళ్లి సాఫ్ట్వేర్ వాడమని చెప్పారు కానీ ఎవరు అప్పుడు ఆసక్తి చూపలేదు, అలంటి సమయం లో ఏమి చేయాలి అని ఆలోచిస్తూవుంటే,అప్పుడే వారికి బెంగుళూరులోని TiE Entrepreneurship Acceleration Program గురించి తెలిసింది. TiE టీమ్‌ను కలుసుకుని తమ ప్రణాళికను వివరించారు.
TiE వారికి ముగ్గురు మెంటర్లను కేటాయించింది. వారు తమ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచనను ఇచ్చి, ప్రాజెక్ట్‌పై కొన్ని అసైన్మెంట్‌లు ఇచ్చారు. అది ఒక రకమైన సర్వే లాంటిది. వారు అప్పగించిన పనిని ఎంతో స్రేమించి పూర్తి చేశారు. ఈ ముగ్గురు యువ వ్యాపారవేత్తలు బస్సుల సంఖ్య, మార్గాలు, టికెట్ ఖర్చు, ప్రజలు టికెట్లు ఎలా కొనుగోలు చేస్తారు, కస్టమర్ ప్రొఫైల్‌లు, బస్సు ఆపరేటర్, ఏజెంట్ వాటాలు వంటి అన్ని వివరాలను సేకరించారు.
వారు 2006 ఆగస్టులో కేవలం ఒకే ఒక బస్సు ఆపరేటర్, 5 సీట్లు, 5 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించారు. Redbus స్టార్టప్ కథ బస్సు పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. వారు redbus.in అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. వెబ్‌సైట్ ప్రారంభించిన తర్వాత వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ విజయానికి ముందు ఎన్నో అవరోధాలను దాటారు.
రెడ్ బస్ అనే పేరు ఎందుకు పెట్టారు :-
ఫణింద్ర రిచర్డ్ బ్రాన్స్‌న్ ఆత్మకథను చదివి ప్రభావితుడయ్యాడు. ఆయన ప్రారంభించిన వర్జిన్ బ్రాండ్కి ఎరుపు రంగు ప్రధాన గుర్తుగా ఉండేది. ఫణింద్ర కూడా తన వ్యాపారానికి ఒక ప్రత్యేకమైన రంగు ఉండాలని కోరుకున్నాడు.
ఇంకా, వారు Redbus అనే పేరు ఎంచుకోవడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది. ఇది ఆన్‌లైన్ సేవ కావడంతో ప్రజలు సులభంగా గుర్తుపట్టే, ఆకర్షణీయమైన పేరు ఉండాలి అని అనుకున్నారు . వర్జిన్ బ్రాండ్ యొక్క రంగు ఎరుపు (Red), మరియు ఇది వారి స్టార్టప్‌కు కూడా సముచితంగా అనిపించింది.
అంతే, చివరికి Redbus అనే పేరు అధికారికంగా నిర్ణయించారు
RedBus పెట్టుబడిదారులు:-
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన Redbus.in వెనుక ఉన్న ప్రధాన పెట్టుబడిదారులు ఇవే:
✅ TiE
✅ Inventus
✅ Helicon Ventures
తక్కువ కాలంలోనే, ముగ్గురు యువ వ్యాపారవేత్తలు తమ RedBus ప్రయాణాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. కొద్ది సంవత్సరాలలోనే, కంపెనీ $12 మిలియన్లకు పైగా ఆదాయం సాధించి, స్టార్టప్ ప్రపంచంలో ఒక సంచలన విజయంగా నిలిచింది.
RedBus విజయాలు:
Phanindra Sama ఇండియాలోని రెండో వ్యాపారవేత్తగా Endeavour సభ్యుడిగా ఎంపికయ్యారు.
✅ బిజినెస్ స్టాండర్డ్ వారు RedBusను అత్యంత నూతన ఆవిష్కరణ కలిగిన కంపెనీగా గుర్తించారు.
✅ Brand Trust Report ప్రకారం అత్యంత నమ్మకమైన బ్రాండ్ గా ఎంపికైంది.
✅ Eye for Travel సంస్థ అందించిన Mobile Innovation Award ను పొందింది.
✅ 2014లో Fortune India వారు Phanindra Sama ను “40 Under 40” లో ఎంపిక చేశారు.
✅ 10 నవంబర్ 2017 న ఆయన తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (TSIC) యొక్క CIO (Chief Innovative Officer) గా నియమితులయ్యారు.
✅ 2010లో Forbes Magazine అందించిన “Top 5 Startups” జాబితాలో స్థానం సంపాదించింది.
RedBus తన విజయం ద్వారా స్టార్టప్ ప్రపంచంలో ఓ గుర్తింపు సాధించింది!
